అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా..ముత్యమా..
కాళిదాసు ప్రేమ కావ్యమా…
త్యాగరాజు సంగీతమా…గీతమా.
పోలికే లేని పాటలా
నువ్వు పిలిచావు నన్నిలా
చిన్న చిరునవ్వు లేత చిగురాశ
మల్లి పూసాయిలే ఇలా…
డి డి డి డెస్టినీ
లైఫ్ ఏ మారిందని
ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హేవెన్లీ – 2
అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా..ముత్యమా..
కాళిదాసు ప్రేమ కావ్యమా…
త్యాగరాజు సంగీతమా…గీతమా.
నీడలా నువ్వొచ్చి వెంట వాలగా
గుండెలో ఉయ్యాల లూగినట్టుగా
గొంతులో స్వరాల మూగపిలుపులే
సందడి చేసెనా
తోడుగా నువ్వోచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా
కాంతుల కళల్ని జల్లినట్లుగా..
ప్రాణం మురిసెనా..
తేనెలో ఉన్న తియ్యనా
బాషలో ఉన్న లాలనా
కుమ్మరిస్తున్న
పొంగిపోతున్న
నిన్ను కలిసేటి వేళలో
కాలమే దోబూచులాడుతున్నదో
కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో
ఏమవుతున్నదో
స్వప్నమే నిజంగ మారుతున్నదో
సాగరం నదల్లె పారుతున్నదో
సత్యమే ఇదంత నమ్మమన్నదో
ఏమంటున్నదో
మరిచిపోయాను నన్నిలా
మరచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్తగా పూతలేసెలా
డి డి డి డెస్టినీ
లైఫ్ ఏ మారిందని
ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హేవెన్లీ – 2
0 Comments