‘Manasa manasa’ సాంగ్ లిరిక్స్: బ్యాచ్‌లర్స్..

‘మనసా మనసా’ సాంగ్ లిరిక్స్: బ్యాచ్‌లర్స్..

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..

 🔊🔊సిద్ శ్రీరాంలా మీరూ పాడేయండి..

ప‌ల్లవి
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
నా మాట అలుసా
నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం - 1
ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే...
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం - 2
తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కలుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
 మనసా మనసా సాంగ్

Post a Comment

0 Comments