పాట :రంగమ్మ మంగమ్మ
గాయకులు:ఎం.ఎం.మానసి
లిరిక్ : చంద్రబోసు
సంగీతం :దేవిశ్రీ ప్రసాద్
ఓయ్ రంగమ్మ… మంగమ్మ…. (2)
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే
ఉంటాడమ్మ పట్టించుకోడు (2).
గొల్లబామ వచ్చి…….
నా…గోరు గిల్లుతుంటే….
గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే…
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే.
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు….
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు (2)
ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే,
మరిచిపోయి మిరపకాయి కొరికినానంతే.
మంటమ్మ మంటమ్మ అంటే చూడడు
, మంచి నీళ్ళైన సేతికియ్యడు – (2)
ఓయ్…
రంగమ్మ….మంగమ్మ….. (2)
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు..
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.
హేయ్….రామా సిలకమ్మ.. రేగి పండు కొడుతుంటే…
రేగి పండు గుజ్జు వచ్చి కోతగా సుట్టుకున్న
రైక మీద పడుతుంటే…
హేయ్… రామ సిలకమ్మ….రేగి పండు
కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే..
మరకమ్మా మరకమ్మా అంటే సుడడు..
మారు రైకైన తెచ్చి ఇవ్వడు. (2)
రంగమ్మ….మంగమ్మ…(2)
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు..
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.
నా అందమంతా మూట గట్టి…
అరె కంది సేనుకే ఎలితే…
ఆ కందిరీగలోచ్చి అడ ఈడ గుచ్చి
నన్ను సుట్టు ముడుతుంటే…
నా అందమంతా మూట గట్టి….కంది సేనుకే ఎలితే…
కందిరీగలోచ్చి నన్ను సుట్టు ముడుతుంటే…
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు – (2)
రంగమ్మ….మంగమ్మ…(2)
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు..
పక్కనే ఉంటాడమ్మ పట్టించు.కోడు.
0 Comments